|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 04:02 PM
గద్వాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం . అయిజ పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా చెలరేగిన మంటలు.అయిజా పట్టణ పరిధిలో ఉన్న ఒక డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు, యంత్రాలు మంటల్లో చిక్కుకొని పూర్తిగా దహనమయ్యాయి. అగ్ని వేగంగా వ్యాపించడంతో సమీప ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యానికి లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విద్యుత్ వ్యవస్థను తరచూ పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.