|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 10:48 PM
తెలంగాణ సీఎం Revanth Reddy అధ్యక్షతన సోమవారం తెలంగాణ క్యాబినెట్ Telangana Cabinet సమావేశం జరిగింది.సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. అయితే, స్వల్ప అనారోగ్యం కారణంగా మంత్రి Tummala Nageswara Rao సమావేశానికి హాజరు కాలేకపోయారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణనపై ఈ భేటీలో సవివర చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. Ramakrishna Rao జనగణన వివరాలను ప్రకటించారు.జనగణన-2027 రెండు దశల్లో నిర్వహించబడనుంది. రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.జనగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం 89,000 మంది సిబ్బందిని నియమించింది. మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లు జరగనున్నాయి. కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నలతో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మొదలవుతుందని సిఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఎన్యుమరేటర్లు, నోడల్ ఆఫీసర్లు మొదలైన మొత్తం 89,000 మంది ఉద్యోగులు రాష్ట్రంలో జనగణన ప్రక్రియలో భాగమవుతారని ఆయన వివరించారు.