|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 12:34 PM
సినీ నటి నిధి అగర్వాల్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామిఈ క్రమంలోనే ఆదివారం (ఫిబ్రవరి 8, 2026) ఉదయం తిరుమల క్షేత్రంలో సినీ గ్లామర్ మెరిసింది. టాలీవుడ్ ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో నిధి అగర్వాల్ ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆమె, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆమెకు రంగనాయకుల మండపంలో ఘనస్వాగతం పలికారు. వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నిధి అగర్వాల్‌ను చూసేందుకు ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఎగబడ్డారు.వారి సేవలో పాల్గొన్నారు.
Latest News