|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 11:37 AM
తెలంగాణకు కాబోయే సీఎం, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజి బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌తో ఆయన సమావేశమయ్యారు. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించారు. దీంతో పాటు మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపు అంశాలపై వారితో చర్చలు జరిపారు. కాసేపట్లో సోనియా గాంధీ, రాహుల్‌తో రేవంత్ భేటీ కానున్నారు.
ఈ నేపథ్యంలో కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపు, డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉండాలి అనే అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈరోజు సాయంత్రంలోగా కేబినెట్ మంత్రులు, వారి శాఖలను ప్రకటిస్తారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేరు ఖరారైనట్లు సమాచారం. మంత్రి రేసులో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రిగా సీతక్క, మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, ప్రేంసాగర్ రావు, వినోద్/వివేక్, రాజనర్సింహ, రామ్మోహన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురే, ఉత్తమ్ పద్మావతి.