|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 01:58 PM
దేవరకొండ ఆర్టీసీ డిపో బస్సులు నిత్యం ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. అన్ని రూట్లలో నడిచే బస్సుల్లో సుమారు 100 మందికి పైగా ప్రయాణీకులు ఉంటుండడంతో బస్సులు నడపడం డ్రైవర్లకు కష్టతరంగా మారింది. ఇక కండక్టర్లుకు కూడా విధుల నిర్వహణ కష్టంగా మారింది. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా బస్సులు కిక్కిరిసిపోతున్నా, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని పలువురు అంటున్నారు.