|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:01 PM
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం అగ్నిపథ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా ఎయిర్ ఫోర్స్ అధికారి సందీప్ పాల్గొని మాట్లాడుతూ. 17-21 వయస్సు గల విద్యార్థులు, యువకులు అగ్నిపథ్ చేరి దేశ రక్షణకు తోడ్పాటు అందించాలన్నారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్ని వీరులకు రక్షణ శాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకల్లో 10 శాతం ప్రాధాన్యం కల్పిస్తారన్నారు.