|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:03 PM
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుతూ బాసర ఐఐఐటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. చాలా సంవత్సరాల నుంచి రిమోట్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నామని, సేవలను గుర్తించి ప్రభుత్వం వేతనాలు పెంచుతూ రెగ్యులరైజ్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.