|
|
by Suryaa Desk | Sat, Jun 22, 2024, 09:56 AM
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిప్పర్తి మండలం మామిడాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన తీగల జానకమ్మ రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. భార్యభర్తలు ఇద్దరు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. మృతురాలి తల్లి బచ్చలకూరి లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.