|
|
by Suryaa Desk | Sat, Jun 22, 2024, 01:41 PM
నేరేడుచర్ల శివాలయం రోడ్లో పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి జరిగింది. సమయానికి ఇంటి యజమాని రావడంతో దొంగలను పట్టుకున్నారు. చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పారిపోయిన వారి వద్ద రూ.60 వేల నగదు, మూడు తులాల విలువైన ఉంగరాలు, చెవిదిద్దులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఇంట్లోకి వెళుతుండగా తమనే దొంగ మీరేవరని అడిగాడని వారు ఆశ్చర్యపోయారు.