by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:37 PM
చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతులు, రాజకీయ నేతల అభిప్రాయాలు తీసుకొని రైతు భరోసా విధివిధానాలు రూపొందిస్తామన్నారు.