![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 10:40 AM
ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయిన కొంకలపల్లి బండరాయిపాకుల నిర్వాసితులకు తాను అండగా ఉండి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం రేవల్లి మండలం బండరాయిపాకులలో ఐమాక్స్ లైట్ల ప్రారంభోత్సవం, హాస్పిటల్ భూమిపూజ చేశారు. గత 10 ఏళ్లలో పాలకులు గ్రామీణ వ్యవస్థను ధ్వంసం చేశారని ఒక్కొక్కటిగా ఇప్పుడు సరి చేస్తున్నామని మీకు న్యాయం చేసే బాధ్యత మీబిడ్డ నాదిని అన్నారు.