![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 12:18 PM
2022లో 19, 2023లో 13 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు తెలంగాణకు వచ్చాయని హరీశ్‌రావు అన్నారు. 2024లో ఒకే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చిందన్నారు. ‘మా పనితీరుకు.. కాంగ్రెస్ పాలనకు ఇంత కంటే ఏం నిదర్శనం కావాలి. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు.. పెంచిన ప్రకారం రాష్ట్రంలో 200లోపు మందికే వైద్యం అందింది. బీఆర్‌ఎస్ హయాంలో రూ.5 లక్షలకు పైగా 607 మందికి వెచ్చించాం’ అని హరీశ్ రావు తెలిపారు.