![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:22 PM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల భూమిలో ప్రభుత్వం చెట్లు కోటివేయడంపై గురువారం సుప్రీంకోర్ట్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల్లో 100 ఎకరాల భూమి చదును పేరుతో చెట్లు నరికివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూమిలో తదుపరి విచారణ వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఈ క్రమంలో ఈ భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులతో గురువారం ఓ ప్రత్యేక కమిటీని వేశారు.
ఈ కమిటీలో భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ హెచ్సీయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, విద్యార్థులు, జేఏసీ, సివిల్ సొసైటీ గ్రూపులతో చర్చించనుంది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క పలు విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వారి నుంచి ఆ భూములకు సంబంధించిన పలు కీలక సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసకున్నట్టు సమాచారం. ఈ భేటీలో సీఎస్ శాంతి కుమారితోసహ అటవీ శాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు.