![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:32 PM
సీతారాముల జీవితం ఆదర్శప్రాయమైందని, రాములోరి కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్ధకం అవుతుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.
ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో జరిగిన రాములోరి కల్యాణానికి వేర్వేరుగా హాజరై తిలకించి పూజలు నిర్వహించారు. సీతారాముల అనుగ్రహంతో సర్వదోషాలు తొలగిపోతాయని, నిజాయితీ సన్మార్గానికి నిలువెత్తు నిదర్శనమని వారు ఆన్నారు.