![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:29 PM
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఇందుర్తి - మేటి చందాపురం గ్రామంలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణానంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.