![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 08:09 PM
అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షను యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. బీసీల ఆత్మ బంధువు అయిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చాలాకాలం నుంచి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్న విషయం విదితమే. పలు సార్లు ధర్నాలు, దీక్షలు నిర్వహించడమే కాకుండా విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతపై పలు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను రెండు సార్లు కలిసి వినతి పత్రాలు కూడా అందించారు.