![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 12:05 PM
జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య .గుండాల మండలం తుర్కల శాపురం గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాపూజీ, డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగం చిత్రపటాలను చేతిలో పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.గ్రామ ప్రజలకు మహనీయుల గురించి,రాజ్యాంగం గురించి వివరించి వాటి విలువలను తెలియజేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.. భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువల పై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా గారు అంబెడ్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.గ్రామ,మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.తుర్కల శాపురంలో గ్రామన్ని దత్తాత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు.ప్రజలకు ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకొని రావాలన్నారు.యువకుల కోసం యువ వికాసం పథకం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం, ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం,మరోవైపు అభివృద్ధిని చేస్తున్నారని మన గ్రామాలలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా అధికారులతో,మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు తెలిపారు.