![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:18 PM
ఆదిలాబాద్ లోని మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వివాహిత 12 ఏళ్ల ఓ బాలికకు మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లింది. అక్కడ తన బంధువులైన ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. రాత్రికి ఇంటికి తిరిగొచ్చిన బాలిక.. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళతో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అనంతరం బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించి ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులతోపాటు మహిళ, ఆమె బంధువుపై ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.