![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 03:13 PM
తెలకపల్లి మండలంలోని బొప్పల్లి, ఆలేరు గ్రామాల్లో మంగళవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో కుల వివక్ష, అంటరానితనంపై సర్వే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోనూ గ్రామాల్లో ఇంకా కుల వివక్ష అంటరానితనం కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.