![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 04:33 PM
తెలంగాణలో చేసిన కులగణన వివరాలను కాంగ్రెస్ సర్కార్ వెల్లడించలేదని BRS MLC కవిత విమర్శించారు. బీసీ కులగణన చేయబోమని BJP చెప్పినందున ఆ పార్టీపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాము కూడా కలిసి వస్తామని.. కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమన్నారు. ఢిల్లీలో దీక్షలో కూర్చుందామని చెప్పారు. చట్టసభలు బిల్లులు ఆమోదించి 4 వారాలైందని.. ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. AI అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని.. దీని వల్ల రాష్ట్రానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆమె ఆరోపించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా.. ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని ఆమె విమర్శించారు.