![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 06:08 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం మినహా మిగిలిన ఆదాయం అంతా తగ్గిపోయిందని పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.గతంలో ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమించుకోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.తెలంగాణలో ప్రతికూల విధానాలు, ప్రతికూల రాజకీయాలు కనిపిస్తున్నాయని విమర్శించారు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కేసుల ఉపసంహరణతో పాటు జంతువధకు కారకులన వారిపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని, దీనిలో బీజేపీ ఎంపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.రేవంత్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు.తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ విజయవంతంగా పాతికేళ్లు పూర్తి చేసుకుంటోందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ చరిత్రలో రజతోత్సవ సభ అతిపెద్దదిగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడతామని కేటీఆర్ చెప్పారు. అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి నెల వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.