![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 07:08 PM
వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంచుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు. అచ్చేదిన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒకేరోజులో హ్యాట్రిక్ కొట్టిందని చురకలంటించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ. 50 పెంపు, ఇంధనంపై అదనంగా రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని విధించిందని విమర్శించారు. సెన్సెక్స్ పతనంతో ఒకే రోజులో రూ. 19 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయని, ఇది వాగ్దానం చేసిన అచ్ఛే దిన్ కు సంకేతమా? లేక మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ ప్రారంభమా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.