![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 07:07 PM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి గారు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పున:పరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు... మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ" అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి పలువురు నటీనటులు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, నటి దియా మీర్జా, నటుడు జాన్ అబ్రహం, పలువురు తెలుగు హీరోహీరోయిన్లు కూడా ఈ విషయమై స్పందించారు.