|
|
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 07:02 PM
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం పవన్ తనయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పందించారు. "సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలిసింది. ఈ వార్త తీవ్ర విచారానికి గురిచేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బాధాకరమైన సమయంలో పవన్ కల్యాణ్ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాను" అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.