![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 09:38 PM
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, సదరు యువతిని కాపాడారు. యువతి బాలానగర్ లోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన మేరీ (36)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.