![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 10:36 AM
తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ‘పంచాయతీ పురోగతి’ సూచికలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 9అంశాల ఆధారంగా ఈ ర్యాంక్ లను కేటాయించగా.. గుజరాత్‌లోని 346, తెలంగాణలో 270 పంచాయతీలు A గ్రేడ్ దక్కించుకుని తొలి 2స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని ఇన్ని పంచాయతీలకు ఇన్ని ఏ-గ్రేడ్‌లు దక్కలేదు. గుజరాత్‌లోని 13,781 పంచాయతీలు, తెలంగాణలోని 10,099 పంచాయతీలు B-గ్రేడ్ దక్కించుకున్నాయి. ఆ ప్రకారం ఉత్తమ పనితీరు కనపరచిన పంచాయతీలను అచీవర్స్ (90-100 మార్కులు), ఫ్రంట్‌రన్నర్ (75-90), పెర్ఫార్మర్ (60-75), యాస్పిరెంట్ (40-50), బిగినర్ (40 మార్కులలోపు)గా విభజించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘పంచాయత్ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్’ పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటుచేసి దరఖాస్తులను ఆహ్వానించగా 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2.55 లక్షల పంచాయతీలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 2.16 లక్షల పంచాయతీలు నమోదు చేసిన డేటాను రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించాయి.