![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 10:49 AM
శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర (ఏప్రిల్ 12) నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి. వి. ఆనంద్ ఐపీఎస్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాత్ర మార్గంలో నిఘా, అదనపు బలగాలు మోహరింపు, డీజేలు-డ్రోన్‌లు నిషేధం, రెచ్చగొట్టే పోస్టర్లకు అనుమతి లేదని సూచనలు ఇచ్చారు. యాత్రలో భద్రత, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.చిన్న ఊరేగింపులు అనుసంధానమయ్యే కూడలి వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, మతపరమైన ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని నిరంతరం నిఘా కొనసాగించాలని సీపీ సూచించారు.