![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 11:42 AM
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో కన్నుమూసిన తమిళి సై తండ్రి అనంతన్.వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఈ రోజు పరిస్థితి విషమించడంతో మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అనంతన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ఆమె కుమార్తె తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచుతున్నారు.అనంతన్ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో తమిళనాడు ప్రభుత్వం అనంతన్కు థకైసల్ అవార్డును ప్రదానం చేసింది. అనంతన్ మార్చి 19, 1933న కన్యాకుమారి జిల్లా అగతీశ్వరంలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు హరికృష్ణన్, తంగమ్మాళ్ దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు అనంతకృష్ణన్. తమిళం అంటే మక్కువ ఉన్న కుమారి అనంతన్, తమిళంలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1977 పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్కోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, పట్టు వదలకుండా ప్రజాసేవలో కొనసాగిన ఆయన జీవిత ప్రయాణం, రాజకీయాల్లోకి వచ్చే కొత్తవారికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.