![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 11:49 AM
జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా. జల్‌పల్లి మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు.తన కూతురు పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని ఆయన సోదరుడు విష్ణు తన ఇంట్లోని కారు తీసుకెళ్లారని పోలీసులను ఆశ్రయించాడు మనోజ్. తన సోదరుడు విష్ణు 150 మందితో జల్ పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశారని.. తమ కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారని.. తన కారును దొంగించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని.. జల్ పల్లిలోని తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని అన్నారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. రికవీరికి వెళ్లినప్పుడు దానిని మాదాపూర్ పంపించినట్లు మనోజ్ మీడియాతో వెల్లడించారు.