![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:35 PM
నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు బుధవారం ఎస్సై రాములు కు రూ. 35 వెలు విరాళాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎస్సై గ్రామస్తులను అభినందించారు. గ్రామాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా దొంగతనాలు, నేరాలు, ఇతర అసాంఘిక నేరాలు జరగకుండా అరికట్టవచ్చని చెప్పారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని చెప్పారు.