![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 08:29 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన 470 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.అంతే కాకుండా వచ్చిన లబ్ధిదారులకు కడుపు నిండ భోజనం చేయించి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి రవాణా సౌకర్యం కోసం ఖర్చులను కూడా అందజేశారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అద్దుతాయని మధ్యలో ఏ దళారులను నమ్మవద్దని అన్నారు.అందుకే నేను దగ్గరుండి ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు.