![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 10:08 PM
భాగ్యనగరం జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి సరఫరా నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని, మోటార్‌ను సీజ్ చేయడంతో పాటు నల్లా నీటి కనెక్షన్‌ను కూడా రద్దు చేస్తామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి హెచ్చరించారు.హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారు. 'మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్' పేరుతో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. వేసవి కాలం రావడంతో నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జలమండలి ఈ నిర్ణయం తీసుకుంది.