|
|
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 10:18 AM
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండపై పెంచిన రూ. 50ని వెంటనే ఉపసంహరించు కోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హుజూర్నగర్ మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ ధర పెంచడం మూలంగా మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.