![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 11:58 AM
హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఎళ్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. ప్రమాదం ఎలా వస్తుందో తెలియని పరిస్థితుల్లో డీఆర్ ఎఫ్ బృందాల అప్రమత్తతతో కొంతమేర నష్టాన్ని తగ్గించగలమన్నారు. మంగళవారం నాడు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది మార్షల్ ఫకృద్దీన్, డీఆర్ ఎఫ్ సహాయక సిబ్బంది ఎ. రమేష్, ఎన్. శ్రీనివాస్, ఎండీ ఇమాముద్దీన్, కె. కార్తీక్ కుమార్‌లను కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అభినందించారు. సాగర్‌లోకి దిగడానికి కూడా వీలు లేని చోట తాళ్ల సాయంతో యువతిని సురక్షితంగా కాపాడారన్నారు. గురువారం భారీ వర్షం కురవగా ఒక్కసారిగా వచ్చిన వరదతో మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా కమిషనర్ అభినందించారు.