![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 12:18 PM
గుండ్రాంపల్లి వెలిమినేడు, పెద్ద కాపర్తి గ్రామాలలో పి.ఏ.సి. ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలనుశాసనసభ్యులు వేముల వీరేశం. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. బుధవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి వెలిమినేడు గుండ్రాంపల్లి గ్రామాలలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం తో పాటు జిల్లా కలెక్టర్ త్రిపాఠి గారితో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ ఏ సి రెడ్డి దయాకర్ రెడ్డి వెలిమినేడు సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ చిట్యాల తాసిల్దార్ కృష్ణ నాయక్మా జీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం. రైతు సంఘం నాయకులు పెదకాపర్తి గుండ్రాంపల్లి. విలిమినేడు సంబంధించిన రైతు సంఘం నాయకులు రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నకిరేకల్ శాసనసభ్యులు వీరేశం మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు.