![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:12 PM
మానవాళికి సత్యం, జ్ఞానం, అహింసా మార్గాలను ప్రబోధించిన ఆధ్యాత్మిక గురువు వర్ధమాన మహావీరుడి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో కుల, లింగ వివక్షతలను వ్యతిరేకించి, ఐక్యతను చాటిన సమదర్శి మహావీరుడి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని రేవంత్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.