|
|
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:16 PM
మధిరలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వంద పడకల ఆస్పత్రి ఎదుట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సాంబశివరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణారావు, మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి, రమేష్, నాయకులు పాల్గొన్నారు.