![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:29 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. వీరి మధ్య గతంలోనూ మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర విభజన సమయంలో కవిత స్వయంగా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఒక 'హాస్యనటుడు అని రాజకీయాల్లో బ్రహ్మానందం అని కూడా అభివర్ణించారు. ఆనాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత కూడా కవిత తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపించడం లేదు.ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని అడిగిన ప్రశ్నకు కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.నేను ఆయన్ని సీరియస్‌గా తీసుకోలేను. ఆయన ఒకప్పుడు స్వయం ప్రకటిత చే గువేరా ఆదర్శవాదిగా ఉండేవారు.రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో పూర్తిగా వామపక్ష భావజాలంతో కనిపించిన పవన్ కల్యాణ్ప్ర స్తుతం బీజేపీతో అంటకాగుతున్నారని కవిత విమర్శించారు. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు ఎమ్మెల్యేగా ఎన్నికై అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని, అది ఏపీ ప్రజల దురదృష్టమని అన్నారు. ఆయన చేసే ప్రకటనల్లో ఒకదానికొకటి పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు