![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:04 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో ఈ స్కూల్‌ను నిర్మించారు. గురువారం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో కలిసి పాఠశాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం క్లాస్ రూంలను పరిశీలించారు. ఆ తర్వాత ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ప్రారంభించి కాసేపు చిన్నారులతో కలిసి సరదాగా గ్రౌండ్‌లో సీఎం ఫుట్‌బాల్ ఆడారు.