![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 07:57 PM
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గంజాయి ముఠా కలకలం సృష్టించింది. చందానగర్ పీఎస్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న గ్యాంగ్.. బైక్‌పై వెళ్తున్న యువకులపై రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో సదరు యువకులకు తీవ్రగాయాలు కావడంతో.. స్థానికులు వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.