![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:29 PM
ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో ఒక రోజు భోజనం చేయాల్సిందే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ... సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలి. కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే.. సన్నబియ్యం ఇస్తోందన్నది అవాస్తవం. కేంద్రం ఇచ్చే బియ్యానికి 20 శాతం ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. గతంలో సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశాం. ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ఏడాదికి రూ. 13,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం