![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 08:05 PM
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకను చంపితే జైలులో పెట్టారని.. HCU భూముల్లోని 3 జింకలు చంపితే రేవంత్ రెడ్డిపై ఏం చర్యలు తీసుకోవాలని BRS నేత హరీశ్ రావు ప్రశ్నించారు. 'గ్రామాల్లో కాదు, HYD నడిబొడ్డున 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరిగితే ఇక్కడే ఉన్న పీపీబీ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖలు ఏం చేస్తున్నాయి. RSప్రవీణ్ కుమార్ PCCFకు ఫిర్యాదు చేసినా స్పందించరా? విద్యార్థులు ధర్నా చేస్తే కనిపించట్లేదా?' అని మండిపడ్డారు.2024 నవంబర్ 22న నాడు హెచ్‌సీయూ భూమిని తాకట్టు పెట్టి 10 వేల కోట్లు అప్పు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా దుర్మార్గం ఏంటంటే.. ఈ అప్పు ఇప్పించడానికి బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తికి రూ. 169 కోట్ల 83 లక్షల అంటే సుమారుగా 170 కోట్లు బ్రోకర్ ఫీజు ఇప్పించారు. నేనేదో ఉట్టిగా చెప్పడం లేదు. నేను అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఇది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మి ఇంకో 40 వేల కోట్లు తేవాలని ప్రయత్నం చేస్తుండు. నియమ నిబంధల్ని ఉల్లంఘిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి చర్యలు, పనులు చేపట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా ఇది టీజీఐఐసీకి చెందినవే అని బోర్డులు పెట్టారు. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటే కూడా భయం లేకుండా పోతున్నది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు