![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 08:06 PM
తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివిధ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.