![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 08:14 PM
యూపీలోని బారాబంకిలో షాకింగ్ ఘటన జరిగింది. మామిడి చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను సూరజ్ కుమార్, నిషాలుగా గుర్తించారు. ప్రియుడు 3 నెలల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. పెళ్లి తరువాత కూడా సూరజ్ నిషాతో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. అబ్బాయి, అమ్మాయి వేర్వేరు వర్గాల వారు కావడంతో..పోలీసులు అన్ని కోణాల నుండి కేసును దర్యాప్తు చేస్తున్నారు.