![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 01:23 PM
బంగారం ధరలు నిన్న మరోమారు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను 145 శాతానికి పెంచడం మదుపర్లలో ఆందోళన పెంచింది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడిపైకి మళ్లించడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఇక, నిన్న దేశీయంగా 10 గ్రాముల పుత్తడి ధరపై రూ. 3 వేల వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,940 పెరిగి రూ. 93,380కి చేరుకుంది. ముంబైలో రూ. 2,940 పెరిగి రూ. 93,380కి ఎగబాకింది. ఇక, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380కి చేరుకుంది. బంగారంతోపాటు వెండి ధర కూడా నిన్న భారీగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ముంబైలో కిలో వెండి ధర ఏకంగా రూ. 2 వేలు పెరిగి రూ. 95 వేలకు చేరుకుంది. హైదరాబాద్‌లో రూ. 5 వేలు పెరిగి రూ. 1.07 లక్షలుగా నమోదైంది.