![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 02:57 PM
బడుగు బలహీనవర్గాల స్త్రీ చైతన్య విద్యా అభ్యాస విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతోత్సవ కార్యక్రమం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు ధరావ సురేష్ నాయక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.