![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 03:46 PM
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా HYD-అంబర్‌పేటలోని ఆ మహనీయుడి విగ్రహానికి CM రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తదితరులతో కలిసి సీఎం స్థలాన్ని పరిశీలించారు.