![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 08:15 PM
ఆధార్ కార్డు చూపించాల్సిన పని లేదు.. నీ పుట్టిన రోజు కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎంత మంది వెళ్తే అంత మందికి పూర్తి ఉచితంగా హైదరాబాద్‌వాసులకు మండి బిర్యానీ పెడతారు. మరి ఈ అదిరిపోయే ఆఫర్ ఎక్కడ.. ఎప్పుడు.. అనేగా మీ డౌటనుమానం. ఈ స్టోరీ చదివేసేయండి. హైటెక్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్ బిగ్ ప్లేట్ మండి తమ కస్టమర్లకు ఈ అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సోమవారం (ఏప్రిల్ 14) రోజున తమ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లందరికీ ఉచిత మండి విందు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విందు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభంకానుంది. అయితే.. ఈ ఆఫర్ కోసం ఎలాంటి ఆధార్ కార్డులు, ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేదని రెస్టారెంట్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
కొన్ని చిన్న చిన్న కండీషన్లు మాత్రం ఉన్నట్టుగా యాజమాన్యం వివరించింది. ఒక్కో వ్యక్తికి ఒక్కసారి మాత్రమే మండి వడ్డించనున్నారు. అయితే.. ఇది అన్ లిమిటెడ్ మాత్రం కాదండోయ్. ఒక్కరికి ఒక్క లెగ్ పీస్‌తో పాటు సింగిల్ మండి రైస్ ఇవ్వనున్నారు. ఇద్దరు వెళ్తే రెండు లెగ్ పీసులు ఇద్దరికి సరిపోయే మండి రైస్, ముగ్గురు వెళ్తే మూడు లెగ్ పీసులు ముగ్గురికి సరిపోయే మండి రైస్.. ఇలా ఎంత మంది వెళ్తే అంత మందికి సరిపోయేంత మాత్రమే ఇవ్వనున్నట్టు యాజమాన్యం స్పష్టం చేసింది.
మరి మండే రోజు మండి బిర్యానీ ఫ్రీగా ఇవ్వటమేంటీ అనుకుంటున్నారా..? అయితే.. ఆ రోజున బిగ్ ప్లేట్ మండి రెస్టారెంట్ పెట్టి ఆరోజుకి మూడేళ్లు అవుతుందంటా. మూడో వార్షికోత్సవం సందర్భంగా.. తమ కస్టమర్లతో పాటు మిగతా భోజన ప్రియులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కిర్రాక్ ఫుడీ అనే ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టాడు. ఈ బిగ్ ప్లేట్ మండి.. హైటెక్ సిటీలో శిల్పారామానికి ఎదురుగా ఉందంటా. మరి ఇంకేందుకు ఆలస్యం.. సోమవారం రోజున ఒక్కపొద్దులు లేని భోజన ప్రియులు బిగ్ ప్లేట్ మండికి వెళ్లి వారి రుచికరమైన ఆతిథ్యాన్ని స్వీకరించేయండి..!