![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 04:41 PM
హైదరాబాద్‌లోని గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.ఈ శోభాయాత్ర గౌలిగూడ నుంచి ప్రారంభమై కోఠి, నారాయణగూడ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, సికింద్రాబాద్ మీదుగా తాడ్‌బండ్ ఆలయానికి చేరుకుంటుంది. 12 కిలోమీటర్ల మేర జరిగే ఈ యాత్రకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.మరోవైపు, కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. సైదాబాద్, మాదన్నపేట మీదుగా ఈ పాదయాత్ర సాగుతుంది