|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 09:19 PM
హనుమాన్ జయంతి ఉత్సవాలు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. హనుమాన్ నామస్మరణతో గద్వాల పట్టణ పురవీధులు మారుమ్రోగాయి. పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయం నుంచి భారీ హనుమాన్ విగ్రహా శోభ యాత్రకు జెడ్పి మాజీ చైర్ పర్సన్ సరితమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై హనుమాన్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు ర్యాలీలో యువత హనుమాన్ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.